ఈటలకు మరో షాక్: ఎక్స్‌ట్రా సెక్యూరిటీ వెనక్కి, హుజూరాబాద్‌కి రాజేందర్

By narsimha lode  |  First Published May 3, 2021, 3:22 PM IST

మంత్రివర్గం నుండి భర్తరఫ్‌ అయిన  ఈటల రాజేందర్‌కు ఉన్న ఎక్స్‌ట్రా సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకొంది. 


హైదరాబాద్: మంత్రివర్గం నుండి భర్తరఫ్‌ అయిన  ఈటల రాజేందర్‌కు ఉన్న ఎక్స్‌ట్రా సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకొంది. మెదక్ జిల్లాలోని  జమున హేచరీస్ సంస్థ అసైన్డ్ భూములను ఆక్రమించుకొందనే కలెక్టర్ రిపోర్టు రావడంతో మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను  తప్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు.  సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయంపై ఈటల రాజేందర్ సోమవారం నాడు స్పందించారు. ధర్మబద్దంగా తాను పోరాటం సాగిస్తానని ఆయన  చెప్పారు. 

also read:ఆలయ భూముల కబ్జా ఆరోపణలు: ఈటెల రాజేందర్ మీద మరో కమిటీ

Latest Videos

మంత్రిగా ఉన్న సమయంలో  ఈటల రాజేందర్ కు ప్రోటో‌కాల్ ఎస్కార్ట్, పైలెట్ వెహికిల్స్  ఉండేవి.  అయితే మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేసిన తర్వాత  ప్రోటోకాల్ ఎస్కార్ట్, పైలెట్ వెహికిల్స్ ను ప్రభుత్వం సోమవారం నాడు వెనక్కి తీసుకొంది. అంతేకాదు  ఈటల రాజేందర్  రక్షణ కోసం గతంలో ఉన్న ఎక్స్‌ట్రా సెక్యూరిటీని  ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. మంత్రివర్గం నుండి భర్తరప్‌ తర్వాత  మంత్రి ఈటల రాజేందర్  ఇవాళ తన స్వంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు బయలుదేరారు. తన నివాసం షామీర్‌పేట నుండి రాజేందర్  హుజురాబాద్‌ కు రోడ్డు మార్గంలో వెళ్లారు. మంత్రి పదవి నుండి తొలగింపబడిన తర్వాత ఈటల రాజేందర్  తొలిసారిగా తన అనుచరులతో ఇవాళ భేటీ కానున్నారు.

click me!