రేపటి నుంచే టీచర్ల బదిలీ ప్రక్రియ ప్రారంభం.. జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

By Sumanth KanukulaFirst Published Jan 26, 2023, 12:26 PM IST
Highlights

తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 5 జారీ చేసింది.

తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబర్ 5 జారీ చేసింది.  టీచర్ల బదిలీలు  వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, పదోన్నతులు మాన్యువల్‌గా జరగనున్నాయి. కేటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలను శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నారు. 

జనవరి 28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆ తర్వాత దరఖాస్తుల హార్డ్​కాపీలను హైస్కూల్ టీచర్లు సంబంధిత హెడ్మాస్టర్లకు.. ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్లు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ ప్రైమరీ, యూపీఎస్ టీచర్లు సంబంధిత కాంప్లెక్స్ హెడ్మాస్టర్లకు.. హైస్కూల్ హెడ్మాస్టర్లు డీఈఓలకు..  జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 దాకా అందించాల్సి ఉంటుంది. వీటిని హెడ్మాస్టర్లు, ఎంఈఓలు ఫిబ్రవరి 3 నుంచి 6 దాకా  డీఈఓ ఆఫీసులో సమర్పిస్తారు. ఆ తర్వాత వివిధ దశలలో ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ టీచర్లకు బదిలీ ఆర్డర్లు జారీ చేయనున్నారు.

click me!