తెలంగాణ బడ్జెట్ 2020: ఆర్టీసీకి రూ. 1000 కోట్లు

By narsimha lodeFirst Published Mar 8, 2020, 2:06 PM IST
Highlights

తెలంగాణలో ఆర్టీసీని  అభివృద్ధి చేసేందుకు రూ. వెయ్యి కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించింది తెలంగాణ సర్కార్.
 

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీని  అభివృద్ధి చేసేందుకు రూ. వెయ్యి కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు బడ్జెట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించింది తెలంగాణ సర్కార్.

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు అసెంబ్లీలో  బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌లో ఆర్టీసీ కోసం రూ. 1000 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తున్నట్టుగా ప్రకటించింది.

Also read:రెవిన్యూ వృద్ధిరేటు 6.3 శాతానికి తగ్గుదల: హరీష్ రావు

ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆర్టీసీ  లాభాల బాటలోకి  వస్తోందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. కార్గో, పార్శిల్ సర్వీసులను సైతం ఆర్టీసీలో  ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. 

ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల  రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గాను ఎంప్లాయిస్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టుగా మంత్రి ప్రకటించారు.

గత ఏడాదిలో తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సుమారు 50 రోజులకు పైగా సమ్మె నిర్వహించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నిర్వహించిన సమ్మె కంటే ఈ సమ్మె అత్యధిక కాలం నిర్వహించిన సమ్మెగా రికార్డు సృష్టించింది. 
 
 

click me!