మారుతీరావు ఆత్మహత్య: స్పృహ తప్పి పడిపోయిన అమృత తల్లి

Published : Mar 08, 2020, 01:19 PM IST
మారుతీరావు ఆత్మహత్య: స్పృహ తప్పి పడిపోయిన అమృత తల్లి

సారాంశం

భర్త ఆత్మహత్యతో మారుతీ రావు భార్య గిరిజ తల్లడిల్లుతున్నారు. ఆమె కంటికీ మింటికీ ఏకధారగా ఏడుస్తున్నారు. మారుతీ రావు మృతదేహం వద్ద ఆమె స్పృహ తప్పి పడిపోయారు. 

హైదరాబాద్: మారుతీ రావు ఆత్మహత్యతో కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. మారుతీ రావు శవాన్ని చూసి భార్య గిరిజ కన్నీరు మున్నీరవుతోంది. శవం వద్ద ఏడుస్తూ ఆమె కింద పడిపోయింది. మారుతీ రావు హైదరాబాదులోని ఆర్యవైశ్య భవన్ లోని గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఆమెను ఓదార్చేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండు చేతులతో తల బాదుకుంటూ ఆమె ఏడ్వడం అందరినీ కలత పెట్టింది. 

Also Read: మారుతీరావు ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు వెల్లడి

మారుతీ రావు మరణించాడని తెలియగానే గిరిజను మరిది శ్రవణ్ హైదరాబాదు తీసుకుని వచ్చాడు. మారుతీ రావు శవాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మారుతీ రావు ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మారుతీరావు అద్దెకు తీసుకున్న ఆర్యవైశ్య భవన్ లోని గదిలో ఓ గ్లాసును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: మారుతీరావు ఆత్మహత్య: అమృత ఇంటి వద్ద భద్రత పెంపు

ఆదివారం ఉదయం మారుతీ రావుకు భార్య గిరిజ పలుమార్లు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తకపోవడంతో డ్రైవర్ కు ఫోన్ చేసి విషయం అడిగారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదని ఆమె డ్రైవర్ తో చెప్పారు. దాంతో అతను గదికి వెళ్లా తలుపు తట్టాడు. తలుపు తెరుచుకోకపోవడంతో సిబ్బందితో కలిసి బలంగా తలుపు తెరిచి చూశాడు. మారుతీరావు విగతజీవుడై మంచం మీద పడి ఉండడాన్ని వారు చూశారు. 

PREV
click me!

Recommended Stories

Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu
Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ