డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ: తెలంగాణ సర్కార్‌ ప్రయోగం

By narsimha lodeFirst Published Apr 30, 2021, 4:57 PM IST
Highlights

  రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా  వ్యాక్సిన్ పంపిణీని ప్రయోగాత్మకంగా పరీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

హైదరాబాద్:  రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా  వ్యాక్సిన్ పంపిణీని ప్రయోగాత్మకంగా పరీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి ఐసీఎంఆర్ తో పాటు డీజీసీఏ కూడ అనుమతిని ఇచ్చింది. రోగుల ఇంటికి నేరుగా మందులు లేదా వ్యాక్సిన్  అందించేందుకు గాను  డ్రోన్లను వినియోగించుకోనున్నారు. 

also read:ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపివేత... తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

also read:తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మరో వారం పొడిగింపు: మే 8వరకు రాత్రి కర్ఫ్యూ

డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్  సరఫరా కోసం అనుమతి కోరుతూ సివిల్ ఏవియేషన్ సంస్థ అనుమతి కోరింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 9న మెయిల్ ద్వారా ఈ విషయమై అభ్యర్ధించింది.  ఈ ఏడాది ఏప్రిల్ 29న  సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ నుండి అనుమతి లభించింది. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ పంపిణీపై అధ్యయనం చేసేందుకు ఐసీఎంఆర్ కూడ  అనుమతిని ఇచ్చింది. పౌరుల ఇంటి వద్దకే నేరుగా వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఈ డ్రోన్లను ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను అమలు చేసిన విషయం తెలిసిందే. 
 

click me!