హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ కామెడీ షో: అనుమతించిన తెలంగాణ సర్కార్

By narsimha lodeFirst Published Aug 19, 2022, 11:57 AM IST
Highlights

హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ షో కు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.ఈ షోకి అనుమతిని ఇవ్వవద్దని  బీజేపీ నేతలు కోరారు. ఈ షోకి అనుమతిస్తే తీవ్ర పరిణామాలుంటాయని కూడ బీజేపీ వార్నింగ్ ఇచ్చింది.

హైదరాబాద్: నగరంలో మునావర్ ఫరూకీ కామెడీ షో కి అనుమతిని ఇచ్చింది ప్రభుత్వం. రేపు  హైద్ఈరాబాద్ లో ఈ షో ను నిర్వహించనున్నారు.ఈ షో నిర్వహిస్తే తీవ్ర పరణామాలుంటాయని బీజేపీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్ ను దగ్దం చేస్తామని కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.మునావర్ షో నిర్వహిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించల్సి వస్తుందని కూగా గతంలోనే రాజాసింగ్ హెచ్చరించారు

ఈ షో కి అనుమతివ్వవద్దని  బీజేపీవైఎం నేతలు నిన్న డీజీపీకి వినతి పత్రం సమర్పించిన విషయం తెలిసిందే. మునావర్ షో లో ఓ వర్గం దేవతలను కించపరర్చేలా వ్యాఖ్యలుంటాయని ఈ షోకి అనుమతివ్వవద్దని  కూడా బీజేవైఎం నేతలు నిన్న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.మునావర్  షోని కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో బ్యాన్ చేసిన విధంగానే తెలంగాణ లో కూడా మునావర్ షో ను రద్దు చేయాలని కోరుతున్నారు.

also read:మునావర్ ఫరూఖీ షోకి అనుమతి వద్దు: డీజీపీకి బీజేవైఎం వినతి

చాలా కాలంగా హైద్రాబాద్ లో కార్యక్రమం నిర్వహించాలని మునావర్ భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించా4లని భావించారు. కానీ కరోనా కారణంగా ఈ షో వాయిదా పడింది. దీంతో ఈ నెల 20న కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టారు.

అయితే మునావర్ ఫరూఖీ షో  నిర్వహణను తీవ్రంగా పరిగణిస్తామని కూడా బీజేపీ ప్రకటించింది. ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్ ను దగ్దం చేస్తామని కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.  ఈ తరుణంలో ఈ షోకి  అనుమతివ్వడంతో బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
 

click me!