కోర్ కోర్సుల్లో తగ్గిన సీట్లు,కంప్యూటర్ సైన్స్ పై ఆసక్తి: తెలంగాణలో మరో 14,565 ఇంజనీరింగ్ సీట్లు

By narsimha lode  |  First Published Jul 6, 2023, 2:03 PM IST

తెలంగాణలో  మరో14,565  సీట్లకు  ప్రభుత్వం  అనుమతిని ఇచ్చింది.  దీంతో  రాష్ట్రంలో 1,00, 671  సీట్లకు చేరుకుంది. కోర్ కోర్సుల్లో సీట్లు భారీగా తగ్గిపోయాయి.


హైదరాబాద్: రాష్ట్రంలో  మరో  14,565 ఇంజనీరింగ్ సీట్లకు   తెలంగాణ ప్రభుత్వం అనుమతి గురువారంనాడు అనుమతిని ఇచ్చింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇచ్చి కంప్యూటర్  కోర్సులకు  అనుమతి కోరాయి  కాలేజీలు. దీంతో కోర్ కోర్సుల స్థానంలో  6,930  సీట్లకు  రాష్ట్ర ప్రభుత్వం  అనుమతిని ఇచ్చింది.  కోర్ కోర్సుల స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో  ఎక్కువ సీట్ల భర్తీకి కాలేజీలకు  ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది.

ఇటీవల  86, 106  ఇంజనీరింగ్ సీట్లకు  ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.  తాజాగా  14,565  సీట్లకు కూడ  అనుమతిని ఇవ్వడంతో రాష్ట్రంలో   ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 1,00, 671 కి  చేరుకుంది. ఎంసెట్ ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్ధులకు  తొలివిడతలో  కాలేజీలను ఎంపిక  చేసుకొనే అవకాశం ఈ నెల  8వ తేదీ వరకు  కల్పించింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి.

Latest Videos

కోర్ గ్రూప్ కోర్సుల్లో చేరే విద్యార్ధుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతూ వస్తుంది. కంప్యూటర్ కోర్సుల వైపే విద్యార్ధులు ఆసక్తిని చూపుతున్నారు.ఈ పరిణామం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు.  భవిష్యత్తుల్లో కోర్ కోర్సులు  చేసే వారి సంఖ్య మరింతగా పడిపోయే  ప్రమాదం ఉందని  ఆందోళన కూడ లేకపోలేదు.  అంతేకాదు కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదువుకునే వారి సంఖ్య కూడ పెరిగి  ఉపాధి అవకాశాలపై  ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన కూడ వ్యక్తమౌతుంది. 

ఇదిలా ఉంటే  తెలంగాణ 6500  సీట్లను ఈడబ్ల్యుఎస్ విభాగంలో  భర్తీ చేసేందుకు  ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు  చేస్తుంది.  తొలివిడత  కౌన్సిలింగ్ లో  6500  సీట్లు ఈడబ్ల్యుఎస్ కోటా కింద భర్తీ చేయనున్నారు అధికారులు.  కన్వీనర్ కోటా  సీట్లకు అదనంగా  ఈడబ్ల్యుఎస్  కోటా కింద  ఈ సీట్లను భర్తీ చేయనున్నారు అధికారులు

click me!