ఘట్‌కేసర్‌లో కిడ్నాపైన చిన్నారి కృష్ణవేణి సురక్షితం: పేరేంట్స్ కు అప్పగించిన రాచకొండ సీపీ

By narsimha lode  |  First Published Jul 6, 2023, 1:37 PM IST

ఘట్ కేసర్ లో కిడ్నాపైన నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణిని  రాచకొండ  సీపీ  చౌహాన్ పేరేంట్స్ కు అప్పగించారు. 


హైదరాబాద్: ఘట్ కేసర్ లో నిన్న రాత్రి కిడ్నాప్‌నకు గురైన  నాలుగేళ్ల చిన్నారి  కృష్ణవేణిని పేరేంట్స్ కు  అప్పగించారు  రాచకొండ పోలీసులు.  ఘట్ కేసర్  డబ్ల్యుఎస్ కాలనీకి  చెందిన  చిన్నారి కృష్ణవేణిని సురేష్ నిన్న  రాత్రి కిడ్నాప్  చేశారు.  కృష్ణవేణి కోసం నిన్న రాత్రి నుండి  పోలీసులు, స్థానికులు  గాలింపు  చర్యలు చేపట్టారు.  అదే కాలనీకి చెందిన సురేష్ బాలికను  కిడ్నాప్ చేసినట్టుగా  పోలీసులు  గుర్తించారు.  సీసీటీవీ పుటేజీలో సురేష్ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలను పరిశీలించారు.  నిందితుడి కోసం  గాలించారు.  ఇవాళ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిందితుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్  చేశారు.  సురేష్ నుండి చిన్నారిని కృష్ణవేణిని  తీసుకువచ్చిన  పోలీసులు  పేరేంట్స్ కు  ఇవాళ అప్పగించారు.

also read:ఘట్ కేసర్ లో కిడ్నాపైన చిన్నారి సురక్షితం.. పోలీసుల అదుపులో నిందితుడు సురేష్..

Latest Videos

అనంతరం  రాచకొండ సీపీ  డీఎస్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు.  ఐటీ సెల్ సహకారంతో  చిన్నారి  కిడ్నాప్ కేసును త్వరగా చేధించినట్టుగా  ఆయన  చెప్పారు.కిడ్నాపర్ రైలులో కాజీ పేట వెళ్లాడన్నారు. అక్కడి నుండి మరో రైలులో సికింద్రాబాద్ కు వచ్చినట్టుగా సీపీ  చౌహాన్ వివరించారు.   కృష్ణవేణి కోసం స్థానిక యువకులు  రాత్రంతా గాలించారన్నారు. స్థానికంగా ఉన్న యువతను  సీపీ  చౌహాన్ అభినందించారు.

 తమకు  యువత బాగా సహకరించిన విషయాన్ని ఆయన మీడియాకు  చెప్పారు. కిడ్నాప్  కేసుల్లో  సాధ్యమైనంత త్వరగా  పోలీసులకు ఫిర్యాదు చేయాలని  ఆయన  సూచించారు.  చిన్నారి కృష్ణవేణి  సురక్షితంగా ఉందన్నారు.   కృష్ణవేణిని సురేష్ ఎందుకు  కిడ్నాప్  చేశారనే విషయం విచారిస్తున్నట్టుగా  సీపీ చెప్పారు. ఈ విషయమై  విచారణ  ముగిసిన తర్వాత  పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టుగా  సీపీ చౌహాన్ తెలిపారు

click me!