ఈ ఏడాది కూడ 46 జీవో మేరకే ఫీజులు: ప్రైవేట్ విద్యాసంస్థలకు తెలంగాణ సర్కార్ ఆదేశం

By narsimha lodeFirst Published Jun 22, 2021, 1:49 PM IST
Highlights

ప్రైవేట్ విద్యా సంస్థలు  ఫీజుల వసూలు విషయమై 46 జీవోను  విడుదల చేసింది తెలంగాణప్రభుత్వం. గత ఏడాది కూడ 46 జీవోను కూడ అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 
 

హైదరాబాద్: ప్రైవేట్ విద్యా సంస్థలు  ఫీజుల వసూలు విషయమై 46 జీవోను  విడుదల చేసింది తెలంగాణప్రభుత్వం. గత ఏడాది కూడ 46 జీవోను కూడ అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గత ఏడాది 46 జీవోకు వ్యతిరేకంగా ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులను వసూలు చేశాయి. ఈ విషయమై ప్రైవేట్ విద్యాసంస్థలపై పలు ఫిర్యాదులు అందాయి.  కొందరు విద్యార్థుల పేరేంట్స్  కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ విషయమై విచారణ సాగుతోంది.  

ఈ ఏడాది కూడ 46 జీవో మేరకు ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెండు మూడు రోజుల్లో సమావేశం కానున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజు కంటే ఒక్క రూపాయి కూడ ఎక్కువ వసూలు చేయవద్దని  ఆదేశించింది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి విద్యా సంవత్సంర ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 25 నుండి ఉపాధ్యాయులను స్కూళ్లకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. డిగ్రీ నుండి ఆపై తరగతి విద్యార్థులకు జూలై 1 నుండి ప్రత్యక్షంగానే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 


 

click me!