హైద్రాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: నిందితుల నుండి రూ. 21 లక్షలు సీజ్

Published : Jun 22, 2021, 11:06 AM IST
హైద్రాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: నిందితుల నుండి రూ. 21 లక్షలు సీజ్

సారాంశం

 హైద్రాబాద్ బాచుపల్లిలో  క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవారం నాడు  అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ బాచుపల్లిలో  క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవారం నాడు  అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కోసం బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులున్నారు. నిందితుల నుండి రూ. 21 లక్షలను సీజ్ చేశారు.

గతంలో కూడ పలు క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో   బెట్టింగ్ నిర్వహిస్తూ  పోలీసులకు పలువురు  పట్టుబడ్డారు.  బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని పోలీసులు హెచ్చరించాు. అయినా కూడ బెట్టింగ్ లు మాత్రం ఆగడం లేదు. బెట్టింగ్ ల కోసం అప్పులు తెచ్చి లక్షలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకొన్న వారు కూడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లను కూడ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫోన్ల డేటా ఆధారంగా ఈ ముఠాతో ఎవరెవరు టచ్ లో ఉన్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. కచ్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు రెండు రోజులుగా నిఘా ఏర్పాటు చేసి రెండు ఇళ్లలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Bullet Train: హైదరాబాద్ టు అమరావతి కేవలం 70 నిమిషాలే ! బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే !
ఇక్క‌డ హ‌నుమంతుడు పాతాళంలో ఉంటాడు.. ప్రపంచంలో ఇలాంటి ఏకైక ఆల‌యం మన హైదరాబాద్‌లోనే