కరోనాకి ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులా?: ఈ నెంబర్‌కి ఫిర్యాదు చేయండి

By narsimha lodeFirst Published May 19, 2021, 3:04 PM IST
Highlights

తెలంగాణలో కరోనా వైద్యం చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ ను ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైద్యం చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ ను ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. కరోనా కేసులపై విచారణ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడంపై కూడ తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. 

దీంతో ప్రభుత్వం ఈ విషయమై చర్యలకు ఉపక్రమించింది. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా వైద్యానికి లక్షలాది రూపాయాలను వసూలు చేస్తున్నారు కరోనాతో చికిత్స పొందుతూ మరణించిన రోగుల కుటుంబాల నుండి పీడిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో ఈ విషయమై ప్రైవేట్ ఆసుపత్రులపై ఫిర్యాదు చేయడానికి 9154170960 వాట్సాప్ నెంబర్ కు ఫోన్ చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ  డైరెక్టర్ జి. శ్రీనివాసరావు బుధవారం నాడు తెలిపారు. 

కరోనా చికిత్సకి  ప్రభుత్వం ధరలను నిర్ధయించింది. ఈ ధరల ప్రకారంగా ఫీజులను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ధరల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచర్చించింది. అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులగురించి తాము ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని తెలంగాణ  వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. 
 

click me!