మొయినాబాద్ ఫాం హౌస్ లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రత పెంచింది.బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించింది.
హైదరాబాద్:మొయినాబాద్ ఫాం హౌస్ ఘటనలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రభుత్వం భద్రతను పెంచింది. నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలతో పాటు ఎస్కార్ట్ సౌకర్యం కల్పించింది.ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భద్రతను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు , కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.,తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలను ముగ్గురు ప్రలోభాలకు గురి చేశారని కేసు నమోదైంది. పైలెట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన ఈ ముగ్గురు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఎమ్మెల్యేలతో ఈ ముగ్గురు మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో సంభాషణలు మీడియా ప్రసారం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారంనాడు రాత్రి మీడియా సమావేశంలో ప్రదర్శించారు. వీడియోను మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలను అన్ని రాష్ట్రాలకు కూడా పంపారు.
undefined
also read:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు: నిందితుల పిటిషన్ పై విచారణ ఈ నెల 7కి వాయిదా
రోహిత్ రెడ్డికి 4+4 గన్ మెన్లను కేటాయిస్తూ గత నెల 29న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.రోహిత్ రెడ్డికి 2+2 గా గన్ మెన్లను పెంచింది. అంతేకాదు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది ప్రభుత్వం. ఇవాళ మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా ప్రభుత్వం భద్రతను పెంచింది. 2+2 గా గన్ మెన్లను 4+4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించింది. ఈ నలుగరు ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భద్రతను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.