
హైదరాబాద్: బతుకమ్మ(bathukamma), దసరా (dussehra)పండుగలను పురస్కరించుకొని ఈ నెల 6వ తేదీ నుండి రాష్ట్రంలోని పాఠశాలలకు (schools) దసరా సెలవులు(holidays) ఇవ్వనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
ఇంటర్ (inter college)కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి సెలవులివ్వనున్నారు. 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు (corona cases) తగ్గు ముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలను తెరిచింది. విద్యా సంస్థల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ (covid protocol)పాటించాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో విద్యా సంస్థలను ప్రారంభించినా కూడ కోవిడ్ కేసులు పెరగలేదు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే దసరాతో పాటు దీపావళి పర్వదినాలు వస్తున్నందున ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది.