తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (telangang congress government) కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన అందరి దగ్గరి నుంచి రేషన్ కార్డుల కోసం (new raiton card applications) దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. మీసేవ ద్వారా వీటిని (telangana raiton cards) తీసుకోవాలని భావిస్తోంది. వచ్చే నెల చివరి వరకు దరాఖాస్తు కోసం అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీగా దాదాపుగా లైన్ క్లియర్ అయ్యింది. అయితే గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోలేని వారు మళ్లీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిచాలని భావిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా పోర్టల్ కూడా ప్రారంభించాలని అనుకుంటోంది.
ప్రతిపక్షంలో బుద్దిగా పని చేయ్ కేటీఆర్ - మంత్రి సీతక్క ఫైర్
మీసేవ ద్వారా అర్హుల నుంచి వెంటనే దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే నెల 29వ తేదీ వరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అనుకుంటోంది. వీటిని స్వీకరించిన అనంతరం పరిశీలన పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ సివిల్ సప్లయ్స్ కసరత్తులు చేస్తోంది.
ఏబీవీపీ నాయకురాలి జుట్టు పట్టుకొని లాగిన కానిస్టేబుల్.. వీడియో వైరల్.. ఎమ్మెల్సీ కవిత ఫైర్..
వాస్తవానికి డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అభయహస్తం ప్రజాపాలన కింద ప్రజల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేసేందుకు వీలుగా అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంది. అయితే వీటిలో రేషన్ కార్డులు ప్రామాణికంగా ఉన్నవే అధికంగా ఉన్నాయి. దీంతో రేషన్ కార్డులు లేని వారి పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో రేషన్ కార్డులు లేని వారు కూడా ప్రజా పాలనలో దరఖాస్తులు ఇవ్వవచ్చని, అలాగే రేషన్ కార్డు కావాలని తెల్లపేపర్ మీద రాసి ఇవ్వాలని మంత్రులు, ప్రభుత్వ అధికారులు సూచించారు.
లక్షల్లో భక్తులు, కోట్లల్లో ఆదాయం... మరో తిరుమలను తలపిస్తున్న అయోధ్య
అయితే తాజాగా వాటితో సంబంధం లేకుండా అర్హులందరూ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొత్తంగా ఇప్పటి వరకు 6,47,297 జారీ అయ్యాయి. అయితే గత ప్రభుత్వంలో కాలం కొత్త దరఖాస్తులను స్వీకరించలేదు. అలాగే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పించ లేదు. దీంతో కొత్తగా పెళ్లైన జంటలకు రేషన్ కార్డులు అందలేదు. అలాగే ఇప్పటికే కార్డుల్లో వారి పిల్లల పేర్లు చేర్చడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే కొత్త ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.