అధికారం లేకుండా కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR) ఉండలేకపోతున్నారని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదని తెలిపారు. గురువారం ఉదయం ఆమె వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు (Minister Seethakka visits Vemulawada Rajanna Temple) నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ప్రజలు బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, అందులో బుద్దిగా పని చేయాలని సూచించారు. అహంకారమే బీఆర్ఎస్ ఓటమికి కారణమని అన్నారు. తొమ్మిదేళ్లు గడీల పాలన సాగిందని విమర్శించారు. ఆమె గురువారం ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
ఏబీవీపీ నాయకురాలి జుట్టు పట్టుకొని లాగిన కానిస్టేబుల్.. వీడియో వైరల్.. ఎమ్మెల్సీ కవిత ఫైర్..
దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయిన తరువాత కేటీఆర్ కు మైండ్ పని చేయడం లేదని అన్నారు. ఆయన విధ్వంస రాజకీయాలకు కేటీఆర్ పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారం లేకుండా కేటీఆర్, కేసీఆర్ ఉండలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం కేసీఆర్ ఇప్పటికీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదని అన్నారు. తమ గురించి మాట్లాడే ముందు కేటీఆర్ కు మైండ్ ఉండాలని, నీచపు కుళ్లు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్
ప్రజలు తమ వైపే ఉన్నారని, మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించు కోలేకపోతున్నారని మంత్రి సీతక్క బీఆర్ఎస్ ను ఉద్దేశించి అన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారని తెలిపారు. సర్పంచులకు ఇవ్వాల్సిన వేల బిల్లులు పెండింగ్ పెట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ఆమె ప్రశ్నించారు. తాము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ ప్రజలు తమకు అవకాశం ఇస్తారని, లేకపోతే ఇవ్వరని తెలిపారు. బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో కేటీఆర్ పని చేయాలని, అప్పుడే ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. లేకపోతే ప్రజలు ఎప్పటికీ తిరస్కరిస్తూనే ఉంటారని తెలిపారు.
గాంధీ వల్ల స్వతంత్రం రాలేదు - తమిళనాడు గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
తమ ఇలవేల్పు వేములవాడ రాజన్న.. తరచూ కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. అదివాసి కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్న ను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లో రాజన్న ఆలయం పట్టించుకోలేదని, అభివృద్ధి చేయడంలో ఆలయం వివక్షకు గురయ్యిందని మంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో వేములవాడ ఆలయాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.