ప్రైవేట్ స్కూల్స్ హాస్టల్స్‌కు అనుమతి: టెన్త్ పరీక్షలపై హైకోర్టుకు తెలంగాణ సర్కార్

By narsimha lodeFirst Published Jun 5, 2020, 2:34 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఈ దఫా పరీక్షలు రాయని వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టెన్త్ పరీక్షల నిర్వహణపై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ నిర్వహించింది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ దఫా పరీక్షలు రాయని వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టెన్త్ పరీక్షల నిర్వహణపై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ నిర్వహించింది.

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షల నిర్వహణపై ఏర్పాట్లపై హైకోర్టు విచారణ చేసింది. ప్రైవేట్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్న హాస్టల్స్ ను తాత్కాలికంగా తెరిచేందుకు అనుమతి ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రకటించారు. 

also read:టెన్త్ పరీక్షల నిర్వహణకు సిద్దం: తెలంగాణ హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

ప్రతి పరీక్షా కేంద్రం వద్ద థర్మల్ స్క్రీనింగ్ సెంటర్లతో పాటు వైద్య సిబ్బందిని కూడ అందుబాటులో ఉంచామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరో వైపు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య సుమారు ఆరు అడగుల కంటే ఎక్కువ దూరం ఉండేలా చర్యలు తీసుకొంటున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

గతంలో ప్రకటించిన పరీక్షా కేంద్రాల కంటే అదనంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో సుమారు 4 వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు  చేసింది.ఈ పరీక్షల విషయమై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

జూన్ మొదటివారంలో టెన్త్ పరీక్షలు నిర్వహణకు తెలంగాణ హైకోర్టు  ఈ ఏడాది మే 22వ తేదీన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జూన్ 3వ తేదీన కరోనా కేసుల విషయమై సమీక్ష నిర్వహించిన తర్వాత అనుమతి ఇస్తామని హైకోర్టు ఆ రోజున స్పష్టం చేసింది. జూన్ 3న రాష్ట్రంలో నివేదిక ఇవ్వాలని కోరింది. దీంతో బుధవారం నాడు హైకోర్టుకు ప్రభుత్వం నివేదికను ఇచ్చింది.

గత నెలలో పరీక్షల నిర్వహణకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ నెల 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 

click me!