కేటీఆర్‌కు ఎన్జీటీ నోటీసులు: ఫామ్‌హౌస్‌పై నిజ నిర్ధారణ కమిటీ నివేదిక

By narsimha lodeFirst Published Jun 5, 2020, 2:03 PM IST
Highlights

తెలంగాణ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకొన్న ఫామ్ హౌస్ లో జీవో 111 కి విరుద్దంగా నిర్మాణాలు చేపట్టడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. 

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకొన్న ఫామ్ హౌస్ లో జీవో 111 కి విరుద్దంగా నిర్మాణాలు చేపట్టడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకొన్న ఫామ్ హౌస్ లో 111 జీవోకి విరుద్దంగా నిర్మాణాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు ఇచ్చింది. 

also read:కేటీఆర్ ఫాం హౌస్‌పై డ్రోన్: ఎయిర్‌పోర్టులో రేవంత్ అరెస్ట్

చెన్నైకి చెందిన ఎన్టీజీటీ ధర్మాసనం  నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నిర్మాణాలు పరిశీలించి అక్రమమైనవా లేదా సక్రమమమైనవా అని తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. 

కేంద్ర పర్యావరణ రిజిస్టరీ కార్యాలయం, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండీఏ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ల సారథ్యంలో ఏర్పాటయ్యే ఈ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

 2018లో 111 జీఓ కేసు విషయంలో ఎన్‌జీటీ ఆదేశాలను యథాతథంగా అమలుచేస్తున్నారా అనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించాలని గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోరింది.

click me!