
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (telangana government) శుభవార్త చెప్పింది. పోలీస్ ఉద్యోగాల (police recruitment) దరఖాస్తుకు గడువు పొడిగించింది. ఈ నెల 26వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే పోలీస్ ఉద్యోగాల కోసం వయో పరిమితిని (age relaxation) సైతం రెండేళ్లు పొడిగించింది. దీనితో పాటు డీఎస్పీ ఉద్యోగ అభ్యర్ధులకు సైతం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అభ్యర్ధుల ఎత్తు (height) 167 సెం.మీ నుంచి 165 సెం.మీకి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
కాగా.. తెలంగాణలో Police శాఖలో ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకున్నవారి నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల నుంచి కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, DGP ని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
also read:గుడ్ న్యూస్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు రెండేళ్ల వయో పరిమితి పెంపు
ఇకపోతే. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళ్టితో గడువు ముగియనుంది. రాష్ట్రంలో 17,291 ఉద్యోగాల భర్తీ చేయడం కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ నెల రెండో తేది నుండి ధరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం వరకు 10 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకొన్నారని సమాచారం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
15,644 పోలీస్ కానిస్టేబుళ్లు, 554 ఎస్ఐ ఉద్యోగాల కోసం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నియామాకాలు జరగనున్నాయి. ప్రిలిమినరీ పరీక్షలు, పిజికల్ టెస్ట్, ఫిజికల్ సామర్ధ్యం టెస్ట్ ల తర్వాత చివరగా మరో పరీక్షను నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్ధులే తర్వాత లెవల్ కి ఎంపికకానున్నారు.