
హైదరాబాద్: Telanganaలోని వివిధ జిల్లాల్లో Lands విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 503 కోట్ల ఆదాయం వచ్చింది.HMDA పరిధిలోని ప్రభుత్వ భూములతో పాటు ఇతర జిల్లాల్లో భూముల విక్రయం ద్వారా ఈ ఆదాయచం సమకూరిందని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నల్గొండ, గద్వాల, కామారెడ్డి, ఆదిలాబాద్, పెద్దపల్లి, వికారాబాద్ జిల్లాల్లో ప్రభుత్వ భూములను విక్రయించారు. తొర్రూరులో గజానికి రూ. 50 వేలు ధర పలికింది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్ పల్లిలో గరిష్టంగా రూ.38,500 ధర పలికింది. మహబూబ్‌నగర్ భూత్పూరులో రూ. 26 వేల ధర పలికింది.
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో హెచ్ఎండీఏకు ప్రభుత్వం 7452 ఎకరాలు కేటాయించింది. హైద్రాబాద్ లో 249 ఎకరాలు, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 558 ఎకరాలున్నాయి. మొత్తం 8250 ఎకరాలలో 3,886 ఎకరాల భూమి వినియోగంలో ఉంది. మిగిలిన 4,374 ఎకరాలు అందుబాటులో ఉంది.
గతంలో నిర్వహించిన collectors సమావేశంలో భూముల విక్రయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్లు భూముల వివరాలను ప్రభుత్వానికి అందించారు.
హైద్రాబాద్ లో భూముల విక్రయానికి సంబంధించి అవకతవకలు చోటు చేసుకొన్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ Revanth Reddy ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు KCR పై కూడా ఆరోపణలు చేశారు.