దమ్ముంటే మంత్రి గంగులపై పోటీ చేసి గెలవాలి: బండి సంజయ్‌కి కేటీఆర్ సవాల్

By narsimha lodeFirst Published Mar 17, 2022, 4:10 PM IST
Highlights


మంత్రి గంగుల కమలాకర్ పై పోటీ చేసి విజయం సాధించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు.

కరీంనగర్: BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bamdi Sanjay కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి kTR గురువారం నాడు సవాల్ విసిరారు. ఇవాళ Karimnagar లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరారు. మంత్రి గంగుల కమలాకర్ పై MLA గా పోటీ చేసి  గెలవాలని సవాల్ చేశారు. బండి సంజయ్ పై లక్ష ఓట్ల మెజారిటీతో  Gangula Kamalakar విజయం సాధిస్తారని మంత్రి కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.  

మూడేళ్లలో కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా అని ఆయన ప్రశ్నించారు.ముస్లింలంతా దేశ ద్రోహులన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆయన బీజేపీపై మండిపడ్డారు.కరీంనగర్ నుండి విజయం సాధించిన బండి సంజయ్ కనీసం రూ. 3 కోట్ల పనులు కూడా చేయలేదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. ఈ విషయమై కనీసం పార్లమెంట్ లో కూడా బండి సంజయ్ మాట్లాడకపోవడాన్ని తప్పుబట్టారు.

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ పోటీ చేశారు. ఈ రెండు దఫాలు గంగుల కమలాకర్ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా  పోటీ చేసి బండి సంజయ్ విజయం సాధించారు.

కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఓటమి పాలైనప్పటికీ ఎంపీ స్థానం నుండి బండి సంజయ్ విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ పై బండి సంజయ్ విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది. గతంలో ఇదే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి మాజీ కేంద్ర మంత్రి విద్యా సాగర్ రావు బీజేపీ అభ్యర్ధిగా ప్రాతినిథ్యం వహించారు. మరో వైపు కేసీఆర్, కూడా ఇదే పార్లమెంట్ స్థానం నుండి గతంలో ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. 

కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ విజయం సాధించిన కొన్నాళ్లకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు.  గత రెండేళ్ల క్రితం బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ పదవీ కాలం పూర్తి కావడంతో బండి సంజయ్ కి బాధ్యతలను అప్పగించింది పార్టీ నాయకత్వం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై  బండి సంజయ్ ఇటీవల కాలంలో దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో సమాధానాలు చెబుతుంది. కరీంనగర్ టూర్ లో ఉన్న మంత్రి కేటీఆర్ కరీంనగర్ నుండి ఎమ్మెల్యేగా గెలవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా  అప్పటి Congress నేతలు చేసిన విమర్శలకు కేసీఆర్ స్పందిస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేసి విజయం సాధించారు.  ఆ సమయంలో ఏపీ సీఎంగా ys Rajasekhara Reddy ఉన్నారు.

 

click me!