పర్యాటక కేంద్రంగా కోయిల్ సాగర్‌: బోటింగ్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Published : Mar 17, 2022, 08:04 PM ISTUpdated : Mar 17, 2022, 08:10 PM IST
పర్యాటక కేంద్రంగా కోయిల్ సాగర్‌: బోటింగ్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

సారాంశం

కోయిల్ సాగర్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.కోయిల్ సాగర్ లో బోటింగ్ ను మంత్రి ఇవాళ ప్రారంభించారు.  


మహబూబ్‌నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా ను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి శ్రీ V. Srinivas Goud  మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బోటింగ్ సౌకర్యాన్ని స్థానిక ఎమ్మెల్యే Ala Venkateshwar Reddy తో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.  ప్రకృతి సిద్ధంగా కొండల నడుమ  ఆహ్లాదకరమైన, అద్భుతమైన వాతావరణంలో  koil sagar  రిజర్వాయర్ ఉందన్నారు. గతంలో ఈ రిజర్వాయర్ లో  బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు .

Telangana వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆవకాశం ఉన్న అన్ని చోట్ల టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోయిల్ సాగర్ లో  boating  సౌకర్యంతో పాటు, హోటల్ ,రెస్టారెంట్, కాటేజస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లలో కూడా పర్యాటక అభివృద్ధికి ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు .

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రామప్ప కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని ఆయన గుర్తు చేశారు.భూదాన్ పోచంపల్లి పర్యాటక గ్రామంగా రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కృషే కారణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనా విధానంతో అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నదే తమ తపన అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. జిల్లాను ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కోయిల్ సాగర్ లో  వచ్చే సంవత్సరం నాటికి పర్యాటకంగా మరికొంత అభివృద్ధి చేస్తామన్నారు.  పర్యాటకశాఖ కల్పిస్తున్న సౌకర్యాలను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
    

"దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కోయిల్ సాగర్ లో బోటింగ్ సౌకర్యం వల్ల చుట్టుపక్కల 3, 4 నియోజక వర్గాల ప్రజల చిరకాల వాంక్ష నెరవేరిందన్నారు .పెద్ద బోటు తో పాటు, స్పీడ్ బోటును కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రానున్నట్టు చెప్పారు., నియోజకవర్గంలోని కర్వెన రిజర్వాయర్ వద్ద కూడా టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కోయిల్ సాగర్ కు పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. తెలిపారు.

పర్యాటక శాఖ ఎండి మనోహర్, దేవరకద్ర ఎంపీపీ రామా శ్రీకాంత్, జడ్పిటిసి అన్నపూర్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి యు. వెంకటేశ్వర్లు,ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్