శాంతి భద్రతల సమస్య: బండి సంజయ్ యాత్ర నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో తెలంగాణ సర్కార్ పిటిషన్

By narsimha lodeFirst Published Aug 26, 2022, 12:22 PM IST
Highlights

బీజేపీ తెలంగాణ చీప్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం.ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కూడా ప్రభుత్వం కోరింది. బండి సంజయ్ యాత్ర కొనసాగితే  శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. 

హైదరాబాద్: బీజేపీతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది ప్రభుత్వం.ప్రజా సంగ్రామ యాత్రకు నిన్న సింగిల్ జడ్జి అనుమతిని ఇచ్చింది. వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. దీంతో శుక్రవారం నాడు ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ తన  పాదయాత్రను ప్రారంభించారు. 

also read:హైకోర్టు అనుమతి: ప్రారంభమైన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

 బండి సంజయ పాదయాత్రపై  సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం  పిటిషన్ దాఖలు చేసింది.  బండి సంజయ్ యాత్ర కొనసాగితే శాంతిభద్రతల సమస్య తలెత్తే  అవకాశం ఉందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కూడా ప్రభుత్వం కోరింది.  ఇవాళ మధ్యాహ్నం 1గంటల తర్వాత ఈ పిటిషన్ ను విచారించనుంది  హైకోర్టు ధర్మాసనం.

ఢిల్లీ లిక్కర్ స్కాం ను నిరసిస్తూ హైద్రాబాద్ లో బీజేపీ శ్రేణులు నిరసకు దిగారు. నిరసనకు దిగిన బీజేపీ శ్రేణులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పు బట్టింది. ఈ నెల 23న బండి సంజయ్ తన పాదయాత్ర శిబిరం వద్ద  దీక్షకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కరీంనగర్ లోని ఆయన ఇంటికి పంపారు.  వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23న ఈ ఆదేశాలను నిరసిస్తూ బీజేపీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ ఆదేశాలపై హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు ఇచ్చింది.వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. దీంతో ఇవాళ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది ప్రభుత్వం.

 

click me!