గాంధీ వైద్యుల ఘనత.. సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ..

By Bukka Sumabala  |  First Published Aug 26, 2022, 11:38 AM IST

హైదరాబాద్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఓ మహిళ మెదడులో ఉన్న కణుతుల్ని తొలగించడానికి సర్జరీ సమయంలో ఆమెకు సినిమా చూపిస్తూ ఆపరేషన్ పూర్తి చేశారు. 


హైదరాబాద్ : సాధారణంగా ఆపరేషన్ అంటే..  వైద్యులు  రోగికి ముందు అనస్తీషియా ఇచ్చి..  ఆ తర్వాత ఆపరేషన్ మొదలుపెడతారు. కానీ, ఎలాంటి మత్తుమందు ఇవ్వకుండా.. ఓ మహిళకు సినిమా చూసే అవకాశం కల్పించి.. ఆమెతో మాట్లాడుతూనే..  రెండు గంటలపాటు సర్జరీ నిర్వహించారు. అయితే, ఈ ఘటన ఎక్కడో.. ఏదో అగ్రరాజ్యాలలోనో, ఐరోపా దేశాల్లోనో… లేదా మన వద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో ‘అవేక్ క్రేనియటోమి’ పేరుతో జరిగింది కాదు. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఈ ఘనతను సాధించారు.

గురువారం గాంధీ ఆస్పత్రి న్యూరోసర్జన్ 50 ఏళ్ల ఓ మహిళ మెదడులో కణతులను తొలగించారు. హైదరాబాద్కు చెందిన ఆ మహిళ ఇటీవల గాంధీ వైద్యులను సంప్రదించారు. వారు పరీక్షలు నిర్వహించి, ఆమె మెదడులో కంతులు ఉన్నట్లుగా గుర్తించారు. గురువారం ఆమెకు శస్త్రచికిత్స చేశారు. రోగికి ఎలాంటి మత్తు ఇవ్వకుండా మెలుకువగా ఉండగానే సర్జరీ నిర్వహించినట్లు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాజారావు వివరించారు.

Latest Videos

undefined

మద్యంమత్తులో.. గర్భిణీ భార్యను నరికి, తానూ నరుక్కుని.. ఓ భర్త ఘాతుకం..

ఆ సమయంలో ఆమెతో వైద్యులు మాట్లాడుతూ… అభిమాన నటుల వివరాలు తెలుసుకుని.. స్మార్ట్ ఫోన్ లో సినిమా చూపించారు. రెండు గంటల పాటు ఆమె సినిమాలో లీనమై.. మధ్యలో వైద్యులు లేదా సిబ్బంది అడిగిన ప్రశ్నలకు బదులిస్తుండగా.. డాక్టర్లు తమ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె తలలో ఉన్న కణుతులను తొలగించారు. ఈ సర్జరీలో న్యూరో సర్జరీ వైద్యులు ప్రకాష్ రావు, ప్రతాప్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

click me!