కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనాటెస్టులు, చికిత్స

By narsimha lodeFirst Published Jul 15, 2020, 10:48 AM IST
Highlights

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడ ఉచితంగా కరోనా రోగులకు చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కూడ ఉచితంగా కరోనా రోగులకు చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటె ఎక్కువ ఫీజులను వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పలువురు ప్రభుత్వానికి పిర్యాదు చేశారు. 

also read:కరోనాకు రూ. 4 లక్షలు వసూలు: ఏం చర్యలు తీసుకొన్నారన్న తెలంగాణ హైకోర్టు

ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ఇద్దరు డాక్టర్లు తమ బాధను సెల్పీ వీడియోల రూపంలో బయటపెట్టారు.  కరోనా రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారని హైకోర్టు ఈ నెల 14వ తేదీన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో  ఉచితంగా కరోనా రోగులకు చికత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

కామినేని, మల్లారెడ్డి, మమత మెడికల్ కాలేజీల్లో కరోనా రోగులకు ఉచితంగా చికిత్స అందించనున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే కరోనా రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 

కానీ తొలి విడతగా ఈ మూడు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా చికిత్సతో పాటు కరోనా పరీక్షలను కూడ ఉచితంంగా నిర్వహించనున్నారు.రానున్న రోజుల్లో మిగిలిన మెడికల్ కాలేజీల్లో కూడ ఉచితంగా కరోనా పరీక్షలు, కరోనా రోగులకు ఉచితంగా చికిత్స అందించే అవకాశం ఉంది.


 

click me!