ఉన్నతాధికారి వాట్సాప్ నుంచి అశ్లీల వీడియో.. నిమిషాల్లో...

By telugu news teamFirst Published Jul 15, 2020, 10:14 AM IST
Highlights

వాట్సాప్ నుంచి ఓ గ్రూప్ లోకి అశ్లీల వీడియో బయటకు వచ్చింది. ఇంకేముంది.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

అతను ఓ ఉన్నతాధికారి. ఎందరికో ఆదర్శంగా నిలవాల్సిన ఆయన ఓ పొరపాటు చేశారు. ఆయన వాట్సాప్ నుంచి ఓ గ్రూప్ లోకి అశ్లీల వీడియో బయటకు వచ్చింది. ఇంకేముంది.. ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేడ్చల్‌ జిల్లా కీసర మండల పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఇటు ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విలేకరులకు సమాచారాన్ని చేరవేసేందుకు గతంలో కీసర హరితహారం అనే వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. ఈ గ్రూప్‌లో కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. 

సోమవారం రాత్రి 11గంటలకు ఓ మండల స్థాయి అధికారి కీసర హరితహారం గ్రూప్‌లో అశ్లీల వీడియో పోస్ట్‌ చేసింది. ఇది వైరల్‌ కావడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో గ్రూప్‌ అడ్మిన్లుగా ఉన్న ఇద్దరు వెంటనే గ్రూప్‌ను డిలిట్‌ చేసి కొత్త గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగి ఇలా చేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా.. ఆ వీడియో తాను కావాలని పోస్టు చేయలేదని ఆ అధికారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పొరపాటున అలా జరిగిందని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలు పోస్టు చేస్తుండగా అలా జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో అందులో అసభ్యకర వీడియో ఉన్నదని గ్రహించలేదు. పొరపాటున గ్రూప్‌లో పోస్టు చేశాను. ఇందులో వేరే ఉద్దేశం లేదని సదరు అధికారి వివరణ ఇచ్చారు. 

click me!