ఈ నెల 13 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు: కీలక బిల్లులు పెట్టనున్న సర్కార్

By narsimha lodeFirst Published Oct 9, 2020, 11:46 AM IST
Highlights

ఈ నెల 13వ తేదీ నుండి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలతో పాటు హైకోర్టు సూచించిన అంశాలపై చట్టాలు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొంది.


హైదరాబాద్: ఈ నెల 13వ తేదీ నుండి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. జీహెచ్ఎంసీ చట్టాల్లో సవరణలతో పాటు హైకోర్టు సూచించిన అంశాలపై చట్టాలు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొంది.

ఈ నెల 13వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నాడు ఉదయం 1:30గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14వ తేదీన ఉదయం 11గంటలకు  శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

also read:రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ యోచన: ఎందుకంటే?

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ  తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో అదే నెల 28వ  తేదీ వరకు నిర్వహించాల్సిన సమావేశాలను అదే నెల 16వ తేదీ వరకు మాత్రమే సమావేశాలను అర్ధాంతరంగా ముగించారు.

అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో ఆ నెల 10వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 

శనివారం నాడు సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు.  అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.

click me!