తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న నిర్వహించాల్సిన ఈసెట్ ను మాత్రం వాయిదా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో EAMCET పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్టుగా Telangana ప్రభుత్వం ప్రకించింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సోమవారం నాడు మధ్యాహ్నం సమావేశమైంది. ఈ నెల 14 నుండి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభత్వం గతంలో నిర్ణయం తీసుకుంది.
అయితే Heavy Rains నేపథ్యంలో ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాలా వద్దా అనే విషయమై Higher Education ఉన్నత విద్యా మండలి చర్చించింది. ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఉన్నత విద్యా మండలి ఇవాళ జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ Agriculture పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అయితే ఈ నెల 13న నిర్వహించాల్సిన ECET పరీక్షను వాయిదా వేశారు.
undefined
also read:తెలంగాణలో భారీ వర్షాలు, వరదలపై కేసీఆర్ సమీక్ష: గోదావరి వరదపై ఆరా
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఈసెట్ పరీక్షను వాయిదా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి. హైద్రాబాద్లో కూడా ఎన్డీఆర్ ఎప్ బృందాలను అధికారులు సిద్దం చేశారు.ఈ నెల 18,19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ నెల 13న రెండు షిఫ్టుల్లో ఈసెట్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ పద్దతిలో ఈ పరీక్షలు నిర్వహించాలని భావించారు. ECE, EIE, CSE, EEE లకు ఈ నెల ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించాలని తలపెట్టారు. మధ్యాహ్నం CIV, CHEM, MEC, MIN, MET, PHM, BSM లకు 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలను నిర్వహించాలని భావించారు. భారీ3 వర్షాల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. హైద్రాబాద్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలను జేఎన్‌టీయూ నిర్వహించడం ఏడోసారి.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పోటెత్తింది. మరో వైపు రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వాగులు,, వంకలు పొంగి పొర్లుతున్నాయి., ఈ తరుణంలో పరీక్షలు రాసేందుకు హాజరయ్యే అభ్యర్ధులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి ఈసెట్ పరీక్షలు వాయిదా వేసింది. అయితే ఈ నెల 14 నుండి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రస్తుతం తెలిపింది. దీంతో ఎంసెట్ పరీక్షలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ కోరారు. మరో వైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా సీఎం ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు.