నాలుగు రోజుల్లో అసెంబ్లీని రద్దు చేయాలి: కేసీఆర్ సవాల్ పై రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Jul 11, 2022, 7:25 PM IST


నాలుగు రోజుల్లో అసెంబ్లీని రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు.  నిన్న కేసీఆర్ చేసిన సవాల్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. 



హైదరాబాద్: నాలుగు రోజుల్లో అసెంబ్లీని రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ Revanth Reddy కేసీఆర్ కు సవాల్ చేశారు. విపక్షాలు డేట్ చెబితే తాను అసెంబ్లీని రద్దు చేస్తాననిKCR  ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే.

సోమవారం నాడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నిన్న విపక్షాలకు  చేసిన సవాల్ పై రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కు నాలుగు రోజుల సమయం ఇస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  నీ పీడ ఎంత తొందరగా పోతోందోనని అందరం ఎదురు చూస్తున్నామన్నారు. కేసీఆర్ నీవు ఎవరికీ కూడా భయపడనివాడివైతే నాలుగు రోజుల్లో అసెంబ్లీని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 

Latest Videos

undefined

also read:నీ మంత్రివర్గమంతా ఏక్‌నాథ్‌షిండేలే: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలు డేట్ చెబితే అసెంబ్లీని రద్దు చేస్తానని ప్రకటించారు. ఈ విషయమై సోమవారం నాడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్పందించాయి. కేసీఆర్ సవాల్ ను స్వీకరించాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలని కోరాయి.  సీఎంగా ఉండి అసెంబ్లీని రద్దు చేయకుండా తమను డేట్ చెప్పాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని విపక్షాలు అభిప్రాయపడ్డాయి.  తాము ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని బీజేపీ ప్రకటించింది.  ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా తాము సిద్దమని ఆ పార్టీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.

మరో వైపు కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఈ విషయమై స్పందించారు.  ముందస్తుకు సై అన్నారు.  అసెంబ్లీని రద్దు చేయకుండా డేట్ నిర్ణయించాలని విపక్షాలను కోరడాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఇవాళ సాయంత్రం  మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకంగా నాలుగు రోజుల సమయం ఇచ్చి అసెంబ్లీని రద్దు చేయాలని కేసీఆర్ కు గడువు ఇచ్చారు. కేసీఆర్ కు నిబద్దత ఉంటే నాలుగు రోజుల్లో అసెంబ్లీని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరారు. 

వరంగల్ లో  రాహుల్ గాంధీతో తమ పార్టీ సభ నిర్వహించి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతి నుండి కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని కేసీఆర్ కు అర్ధమైందని రేవంత్ రెడ్డి చెప్పారు.  

2018 లో కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే ఈ దఫా మత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని గతంలో ప్రకటించారు కానీ నిన్న మాత్రం ముందస్తు ఎన్నికల విషయమై విపక్షాల కోర్టులో బంతిని నెట్టారు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ కు నాలుగు రోజుల సమయం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సమయంపై టీఆర్ఎస్ వర్గాలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.
 

click me!