ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల రక్షణపై కమిటీ ... తొలి భేటికి హాజరైన సబిత

By Siva KodatiFirst Published Nov 26, 2022, 5:24 PM IST
Highlights

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల భద్రత, రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలి భేటీకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల భద్రత, రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అడిషనల్ డీజీ స్వాతి లక్రాను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!