డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

By narsimha lodeFirst Published Mar 6, 2019, 6:35 PM IST
Highlights

ఐటీ గ్రిడ్ కేసును సమగ్రంగా విచారించేందుకు గాను ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం  ఏర్పాటు చేయాలని  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసును సమగ్రంగా విచారించేందుకు గాను ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం  ఏర్పాటు చేయాలని  తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఐటీ గ్రిడ్‌పై సైబరాబాద్, హైద్రాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసులను దర్యాప్తు చేసేందుకుగాను సిట్‌ను ఏర్పాటు చేశారు.ఐటీ గ్రిడ్‌పై ఇప్పటికే రెండు కమిషనరేట్లపై కేసులు నమోదయ్యాయి.

రెండు కమిషనరేట్ల పరిధిలో పోలీసు అధికారులు  దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఒకే కేసు కావడంతో కేసును ఒకే అధికారి పర్యవేక్షణ కింద చేయాలని  భావించి సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది. 

ఐజీ స్టీఫెన్ రవీంద్ర  సిట్‌కు నాయకత్వం వహిస్తాడు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ముగ్గురు ఐపీఎస్‌లు, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు సభ్యులుగా ఉంటారు.ఈ  బృందంలో  సైబర్ క్రైమ్స్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో 
ఇద్దరు ఇన్ స్పెక్టర్లను ప్రభుత్వం నియమించింది.

click me!