కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి రైతు బంధు డబ్బులు: కేటీఆర్

Published : Mar 06, 2019, 03:12 PM IST
కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి రైతు బంధు డబ్బులు: కేటీఆర్

సారాంశం

తనపై సిరిసిల్ల నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి మహేందర్ రెడ్డికి రైతు బంధు పథకం కింద  డబ్బులు వచ్చాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.  

కరీంనగర్: తనపై సిరిసిల్ల నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి మహేందర్ రెడ్డికి రైతు బంధు పథకం కింద  డబ్బులు వచ్చాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.  రైతు బంధు పథకం కింద రూ.4 లక్షల చెక్ ను తీసుకొన్నాడన్నారు.

బుధవారం నాడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  అనేక సంక్షేమ పథకాలు కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకొంటున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కూడ చాటు మాటుగా  రాష్ట్ర ప్రభుత్వ పథకాలను చాటుగా  తీసుకొంటున్నారని చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను కూడ ఓట్లను  అడగాలన్నారు. తెలంగాణలో ఉన్నవారంతా మనోళ్లేనని  చెప్పారు. ఇతర పార్టీలను  అభ్యర్ధులను ఓటు అడగాలని కేటీఆర్ కోరారు.

సంబంధిత వార్తలు

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో వంద మంది ఎంపీలు: కేటీఆర్


 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?