ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై కమిటీని నియమించిన ప్రభుత్వం

By Siva KodatiFirst Published Apr 22, 2019, 8:17 AM IST
Highlights

ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ నియమించింది. 

ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ నియమించింది. పరీక్షా ఫలితాలలో తలెత్తిన గందరగోళంపై విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫలితాల విషయంలో చోటు చేసుకున్న అపోహలను తొలగించడానికి గాను టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో బిట్స్ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ వాసన్‌తో పాటు... ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ నిశాంత్‌లను నియమించినట్లు మంత్రి తెలిపారు. ఫలితాల విషయంలో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.

కొంతమంది అధికారుల అంతర్గత తగదాల కారణంగానే ఈ అపోహలు సృష్టించబడ్డట్టు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పొరపాటు జరిగినట్లు భావిస్తే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌లకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జగదీష్ రెడ్డి సూచించారు. ఎటువంటి పొరపాటు జరిగినా సరిదిద్దుతామని, ఏ ఒక్క విద్యార్ధిని నష్టపోనివ్వమని మంత్రి స్పష్టం చేశారు. 

click me!