అవార్డులందుకోనున్న మహిళలు వీళ్లే...

Published : Mar 06, 2017, 12:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
అవార్డులందుకోనున్న మహిళలు వీళ్లే...

సారాంశం

అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని 24 మంది మహిళలకు అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన రాష్ట్రానికి చెందిన 24 మంది మహిళలకు అవార్డులు ప్రకటించింది. సామాజిక సేవ, విద్య, వ్యవసాయం, సాహిత్యం, వృత్తి సేవలలో రాణించిన మహిళామణులకు ఈ నెల 8 న అంతర్జాతీయ మహిళాదినోవత్సం సందర్భంగా అవార్డులు అందజేయనుంది.

 

తెలంగాణ ఉద్యమ పాటలు రాసిన ఇద్దరికి, పాత్రికేయ రంగంలో ముగ్గురికి పురస్కారాలు వరించాయి. వందశాతం నగదు రహిత లావాదేవీల్లో కృషికి 2 గ్రామ పంచాయతీల సర్పంచ్ లకు అవార్డులను ప్రకటించారు. ఈ 24 మంది మహిళలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనున్నది. 

విద్యారంగం : డాక్టర్ విద్యావతి (కాకతీయ యూనివర్సిటీకి ఉపకులపతిగా పని చేశారు. తెలంగాణలో తొలిసారిగా విద్యావతినే ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారు. వరంగల్)
 

సామాజిక సేవ : జానకి(హైదరాబాద్), దేవకీదేవి(మహబూబ్‌నగర్), గాయత్రి(వనపర్తి), లక్ష్మీబాయి(ఆదిలాబాద్)
 

వ్యవసాయం : సుగుణమ్మ(జనగామ), నాగమణి(నల్లగొండ)
 

తెలంగాణ ఉద్యమకారులు :ఎస్. మణమ్మ(ఉప్పల్), ధాత్రిక స్వప్న(ఓయూ విద్యార్థి, హైదరాబాద్), మూల విజయారెడ్డి(పెద్దపల్లి)
 

వృత్తిసేవలు : ప్రమీల, న్యాయవాది(మంచిర్యాల)
 

సాహిత్యం : రజిత(వరంగల్), షాజహాన(ఖమ్మం)
 

నృత్యం : వనజా ఉదయ్(హైదరాబాద్)
 

చిత్రలేఖనం : అంజనీరెడ్డి(జహీరాబాద్)
 

సంగీతం : పాయల్ కొట్గరీకర్(నిజామాబాద్)
 

తెలంగాణ ఉద్యమ పాటలు : చైతన్య(నల్లగొండ), స్వర్ణ(కరీంనగర్)
 

క్రీడలు : ప్రియదర్శిని(కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకం, వరంగల్)
 

పాత్రికేయ రంగం : మాడపాటి సత్యవతి(రేడియోలో తొలిసారిగా వార్తలు చదివిన మహిళ. హైదరాబాద్), కట్టా కవిత (నల్లగొండ), జి. మల్లీశ్వరి( వీడియో జర్నలిస్టు, వరంగల్)
 

సర్పంచ్ లు : ఎం. పద్మ(కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం), కె. లక్ష్మి(సిద్ధిపేట జిల్లా ఇబ్రహీంపూర్ గ్రామం) 

 

PREV
click me!

Recommended Stories

నల్గొండ భహిరంగ సభలో రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Inaugurates Development Works
Weather Update: హైదరాబాద్‌తో పాటు ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. 14 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్