ఎన్నికల హామీలను అమలు చేయడానికి బడ్జెట్ లో తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయించింది.
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో 200 యూనిట్ల వరకు గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.ఈ హామీ మేరకు తెలంగాణ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,418 కోట్లు కేటాయించింది.ప్రజా పాలన కింద ధరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది. ఈ ధరఖాస్తుదారుల డేటాను ప్రభుత్వం భద్రపర్చింది.
గృహజ్యోతి పథకం కింద లబ్దిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తుంది. విద్యుత్ బిల్లుల రీడింగ్ తీసేందుకు వచ్చే సిబ్బంది ద్వారా గృహ విద్యుత్ వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తుంది. రాష్ట్రంలో 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగదారులు అర్హులను గుర్తించి వారికి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. లబ్దిదారులకు ప్రభుత్వం నుండి ట్రాన్స్ కోకు నిధులను అందించనుంది. ఈ పథకానికి ప్రభుత్వం రూ. 2,418 కోట్లు కేటాయించింది.
undefined
also read:మేడిగడ్డ విజిలెన్స్ విచారణలో దోషులెవరో తేలుతారు: మీడియా చిట్ చాట్‌లో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రైతులకు ఉచిత విద్యుత్ ను కొనసాగిస్తున్నామన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అమలు చేసిన విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.ఈ హామీ అమలు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కార్యాచరణ సిద్దం చేసింది.ఇప్పటికే రెండు హామీలను అమలు చేసింది. మరో రెండు హామీలను అమలు చేయనున్నట్టుగా ప్రకటించింది.