హైద్రాబాద్, వరంగల్ లలో సూపర్ స్నెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం .
హైదరాబాద్: వరంగల్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ సిటీని నిర్మించనుంది ప్రభుత్వం . ఇందు కోసం రూ. 1100 కోట్లను ఖర్చు చేయనుంది. రెండువేల పడకల సామర్ధ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనుంది ప్రభుత్వం .మరో ఏడాదిలో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పేదలకు కార్పోరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం వరంగల్ నగరంలో హెల్త్ సిటీని ఏర్పాుటు చేయనుంది.
హైద్రాబాద్ నగరంలో కూడా సూపర్ స్టెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆసుపత్రులను నిర్మిస్తుంది. హైద్రాబాద్ కు నాలుగు వైపులా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనుంది. గచ్చిబౌలి, సనత్ నగర్, ఎల్ బీ నగర్ , అల్వాల్ , ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నాలుగు ఆసుపత్రుల్లో 4,200 పడకలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని ఆధునాతమైన వసతులు ఈ ఆసుపత్రుల్లో ఉంటాయి.
జిల్లాకు ఓ మెడికల్ కాలేజీని కూడ నిర్మిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ అ అంశాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సంగారెడ్డి, మహబూబాబాద్ , మంచిర్యాల, జగిత్యాల, కొత్తగూడెం , నాగర్ కర్నూల్, రామగుండంలలో మెడికల్ కాలేజీలను ప్రారంభించింది ప్రభుత్వం .కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది.