మహిళల రక్షణకు తెలంగాణ సర్కారు మరో ముందడుగు

First Published Aug 4, 2017, 12:39 PM IST
Highlights
  • ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
  •  ఆగస్టు 15  స్వాతంత్య్ర దినోత్సవం నుండి  టోల్ ప్రీ నెంబర్ 181  పనిచేయనుంది

 
 మహిళా సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.  ఇప్పటికే వారి రక్షణకు అనేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా ఉమెన్ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15 స్వాతంత్య్ర దినోత్సవం నుండి ఈ హెల్ప్‌లైన్ నెంబర్ అందుబాటులోకి రాబోతోంది. ఒక్క పోన్ కాల్ తో తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు టోల్ ప్రీ నెంబర్ 181 కేటాయించింది ప్రభుత్వం. 
ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, మొదట హదరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతోంది. సిటీలో మహిళలను బస్టాపుల్లో,రోడ్లపై, ఆపీసుల్లోను వేధింపులు ఎక్కువైన నేపథ్యంలో ఈ టోల్ ప్రీ నెంబర్ వారికి ఉపయోగంగా ఉండనుందని మహిళా రక్షణ కమిటీ సభ్యులు తెలిపారు.ఐటీ ప్రాంతాలపై ముఖ్యంగా దృష్టి పెట్టినట్లు వారు తెలిపారు. దశల వారిగా మిగతా జిల్లాకు దీన్ని విస్తరించనున్నట్లు అధికారులు  చెబుతున్నారు.
పోకిరీల బారినుంచే కాకుండా అత్తమామలు, బంధువులు, ఇతర నేరస్థుల బారి నుంచి మహిళలను కాపాడేందుకు ఈ హెల్ప్‌లైన్ ఉపయోగపడనుంది.ఇప్పటికే షి టీమ్ లు కూడా మహిళారక్షణకు పనిచేస్తుండగా,దీన్ని అనుసంధానం చేసుకుని  హెల్ప్ లైన్ సెంటర్ పనిచేస్తుందని అధికారులు తెలుపుతున్నారు. అయితే  ఇది పోలీసు శాఖ ఆధ్వంర్వంలో కాకుండా, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ  ఆదీనంలో పనిచేయనున్నాయి.
 

click me!