
గద్వాల జిల్లలో ఒక పోలీసు తన వద్ద పనిచేసే మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయిండు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గద్వాల జోగుళాంబ జల్లాలో ఒక మహిళా హోంగార్డుతో ఎఎస్ఐ మసాజ్ చేయించుకుంటూ దొరికిపోయిండు. అది కూడా ఆ మహిళ యూనిఫామ్ లో ఉండగానే ఆమెతో మసాజ్ చేయించుకుంటున్నాడు.
గద్వాలలో రిజర్వుడ్ ఎఎస్ఐ గా పనిచేస్తున్న హసన్ తన దగ్గర పనిచేసే మహిళా హోంగార్డుతో మజాస్ చేయించుకున్నాడు. ఈ సమాచారం మీడియాకు తెలిసింది. దీంతో ఆ ఎఎస్ఐ బండారం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ విచారణకు ఆదేశించారు. అయితే దీనిపై రహస్య విచారణ చేపట్టాలని ఎస్సీ విజయ్ కుమార్ ఆదేశించారని సమాచారం. ఎఎస్పీ భాస్కర్ విచారణ జరుపుతున్నారు.
సరూర్ నగర్ సిఐ లింగయ్య గతంలో తన కానిస్టేబుల్ తో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయిన విషయం మరుగునపడకముందే గద్వాల జిల్లాలో మరో మసాజ్ బాగోతం బయటపడింది.
మొత్తానికి పోలీసు బాసులంతా మసాజ్ చేయించుకుంటూ దొరికిపోతుండడంతో జనాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.