తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు: రేపు నిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ కొత్త బ్లాక్‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న సీఎం

By Mahesh Rajamoni  |  First Published Jun 13, 2023, 8:33 PM IST

Hyderabad: తెలంగాణ వైద్య దినోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నారు. తృతీయ శ్రేణి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల నుంచి సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, బస్తీ, పల్లె దవాఖానలతో సహా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల‌ను జ‌రుపుకోనున్నాయి. 
 


Telangana Medical Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం 'తెలంగాణ వైద్య దినోత్సవాన్ని' నిర్వహించనున్నారు. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో అత్యాధునిక 2000 పడకల సూపర్ స్పెషాలిటీ కొత్త బ్లాక్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శంకుస్థాపన చేయడం, తెలంగాణలోని 24 జిల్లాల్లో గర్భిణుల కోసం కేసీఆర్ పౌష్టికాహార కిట్ల విస్తరణ తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో ప్రధాన కార్య‌క్ర‌మాలుగా ఉన్నాయి.  తృతీయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు మొదలుకొని సబ్ సెంటర్లు, పీహెచ్ సీలు, బస్తీ, పల్లె దవాఖానలు సహా అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భావం నుంచి చేపడుతున్న ప్రజారోగ్య సంరక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.

హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నూతనంగా నిర్మించనున్న నిమ్స్ బ్లాక్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం కేసీఆర్ నిర్వహించే భూమి పూజ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రి హరీశ్ రావు నిమ్స్ ను సందర్శించారు. నిమ్స్ లో శంకుస్థాపన కార్యక్రమం మొత్తం సజావుగా జరిగేలా చూడాలని సమీక్షలో హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. రూ.1571 కోట్లతో చేపట్టనున్న ఈ బ్లాక్ లో మొత్తం 2000 పడకలు ఉండ‌నున్నాయి. 

Latest Videos

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 14వ తేదీని తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. నిమ్స్ విస్తరణ ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి గణనీయంగా దోహదం చేస్తుందనీ, అందరికీ అందుబాటులో-నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను నిర్ధారించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. 

click me!