ముగిసిన టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియలు .. పాడె మోసిన చంద్రబాబు

Siva Kodati |  
Published : Jun 13, 2023, 08:03 PM IST
ముగిసిన టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియలు .. పాడె మోసిన చంద్రబాబు

సారాంశం

టీడీపీ సీనియర్ నేత, మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా పర్కాపూర్‌లో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రు నయనాల మధ్య పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సహచరుడి పాడెను మోశారు. 

టీడీపీ సీనియర్ నేత, మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా పర్కాపూర్‌లో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రు నయనాల మధ్య పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన సహచరుడికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తుది వీడ్కోలు పలికారు. దయాకర్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు.. అంత్యక్రియల సందర్భంగా దయాకర్ రెడ్డి పాడెను చంద్రబాబు మోశారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ అండగా వుంటుందని వారికి ధైర్యం చెప్పారు. 

కాగా.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా , జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన ఆయన.. అమరచింత నుంచి రెండుసార్లు, మక్తల్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొత్తకోట మరణం పట్ల తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి.. టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం తెలియజేశారు. 

 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే