ప్రతి ఒక్కరిపై రూ. 1.39 లక్షల అప్పు: కేంద్రం అప్పులపై హరీష్ రావు

By narsimha lode  |  First Published Feb 8, 2023, 3:38 PM IST

కేంద్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి రోజువారీ  కార్యకలాపాలను నిర్వహిస్తుందని తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు విమర్శించారు.  
 



హైదరాబాద్:తమ ప్రభుత్వం  కేపిటల్ వ్యయం  కోసం  అప్పులను ఖర్చు చేస్తుందని తెలంగాణ మంత్రి హరీష్ రావు  చెప్పారు. కానీ కేంద్రం  మాత్రం ఈ అప్పులను   రెవిన్యూ వ్యయం కోసం ఖర్చు చేస్తుందన్నారు.తెలంగాణ బడ్జెట్ పై విపక్షాల  ప్రశ్నలకు  మంత్రి  హరీష్ రావు  బుధవారం నాడు  సమాధానమిచ్చారు.  

కేంద్రం  తీసుకున్న అప్పుల్లో  48. 6 శాతం రోజువారీ ఖర్చుల కోసం  ఉపయోగిస్తున్నారన్నారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులను  రెవిన్యూ వ్యయం కోసం ఉపయోగిస్తుందన్నారు.   తమ ప్రభుత్వం తీసుకున్న అప్పులను  కేపిటల్ వ్యం  కోసం ఖర్చు చేస్తున్నట్టుగా  మంత్రి హరీష్ రావు వివరించారు.   కేంద్ర ప్రభుత్వం  నెలకు  రూ. 1 లక్ష కోట్లు అప్పు చేస్తుందని  మంత్రి హరీష్ రావు చెప్పారు.

Latest Videos

  ప్రతి రోజూ  రూ. 4, 618 కోట్లను కేంద్రం  అప్పు తీసుకుంటుందని  మంత్రి హరీష్ రావు వివరించారు. ప్రతి నెలకు  తీసుకున్న అప్పునకు  కేంద్రం  రూ. 2959 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తుందని  మంత్రి హరీష్ రావు వివరించారు.  అప్పుల గురించి  కేంద్రం మాకు  నీతులు చెబుతుందా అని  హరీష్ రావు  ప్రశ్నించారు.   కేంద్రం తీసుకున్న అప్పులు  రూ. 160 లక్షల కోట్లు దాటిందన్నారు.  ప్రతి ఒక్కరిపై కేంద్రం రూ. 1.39 లక్షల అప్పులు వేసిందని మంత్రి హరీష్ రావు లెలిపారు.  

also read:తెలంగాణపై కేంద్రం వివక్ష: అసెంబ్లీలో హరీష్ రావు ఫైర్

అప్పులు తెచ్చామని  తమపై కేంద్ర  ప్రభుత్వం విమర్శలు చేస్తుందని  ఆయన మండిపడ్డారు.  చేసిన అప్పులను  ఎవరు దేని కోసం ఖర్చు పెడుతున్నారో ప్రజలు ఆలోచించాలని  ఆయన  కోరారు.  అప్పులు  చేస్తున్నామని  తమ ప్రభుత్వంపై  ఆరోపణలు చేసేవారంతా  ఇప్పటికైనా కళ్లు తెరవాలని  హరీష్ రావు   హితవు పలికారు.  
 

click me!