పోతిరెడ్డిపాడుపై ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు

By narsimha lodeFirst Published Aug 21, 2020, 1:45 PM IST
Highlights

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు)   ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసింది.ఈ కేసును రీ ఓపెన్ చేయాలని  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ధరఖాస్తును చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం అనుమతించింది.


చెన్నై: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు)   ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసింది.ఈ కేసును రీ ఓపెన్ చేయాలని  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ధరఖాస్తును చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ధర్మాసనం అనుమతించింది.

ఇదే విషయమై తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్జీటీ తీర్పును రిజర్వ్ చేసింది.  తాజాగా తెలంగాణ ప్రభుత్వం మరో పిటిషన్ ను దాఖలు చేయడంతో తీర్పు వాయిదా పడింది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని మహాబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది.

also read:కేసీఆర్‌కి జగన్ షాక్: పోతిరెడ్డిపాడు టెండర్ నేడే ఫైనల్

తెలంగాణ ప్రభుత్వం కూడ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 28వ తేదీన తుది వాదనలు వింటామని ఎన్జీటీ ధర్మాసనం ప్రకటించింది. తెలంగాణకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అఫిడవిట్ దాఖలు చేసింది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. 
 

click me!