శ్రీశైలంలో జరిగింది ప్రమాదం కాదు, వారిద్దరి కుట్ర: రేవంత్ సంచలనం

By team teluguFirst Published Aug 21, 2020, 1:14 PM IST
Highlights

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా? అనే విషయంలో అనుమానం వ్యక్తమవుతోందంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. 

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోందంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా? అనే విషయంలో అనుమానం వ్యక్తమవుతోందంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకరించి,విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని తాము ముందే చెప్పామని, జరిగిన పరిణామం అనుమానాలకు తావిస్తోందని రేవంత్ అన్నారు. ఈ కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమోననిపిస్తోందని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేసారు. 

శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో జరిగింది ప్రమాదమా? కుట్రా!?జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకరించి,విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని ముందే చెప్పాం. జరిగిన పరిణామం అనుమానాలకు తావిస్తోంది.కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమోననిపిస్తోంది.
ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలి

— Revanth Reddy (@revanth_anumula)

ఆయన సియోష మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇకపోతే... శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో మంటలు అదుపులోకి వచ్చినట్టుగా అగ్నిమాపక సిబ్బంది శుక్రవారం నాడు ప్రకటించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మంటల్లో చిక్కుకొన్న 9 మంది విద్యుత్ సిబ్బంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. 

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారంనాడు అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కొందరు గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో 4వ యూనిట్ టర్మినల్ లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్యానెల్ బోర్డులో భారీగా పేలుడు వాటిల్లినట్టుగా అధికారులు చెబుతున్నారు. జీరో లెవల్ నుండి సర్వీస్ బే వరకు పొగ అలుముకొంది. అగ్నిమాపక వాహనాలు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లడానికి సుమారు 20 నిమిషాలు పడుతోందని ఫైర్ సిబ్బంది చెప్పారు. 

మంటల్లో చిక్కుకొన్న 9 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సింగరేణి రెస్క్యూ టీమ్ కూడ సంఘటన స్థలానికి చేరుకొంది. ప్రమాదంలో చిక్కుకొన్న 9 మంది ఉద్యోగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం వాటిల్లినట్టుగా ఫైర్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

click me!