ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తడబడ్డాడు

Published : Jul 17, 2017, 05:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తడబడ్డాడు

సారాంశం

టిఆర్ఎస్  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పొరపాటు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో తడబాటు మంత్రి హరీష్ కు వివరణ సిఎం కు చెప్పుకోవాలని హరీష్ సూచన  

తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ లో తడబాటుకు గురయ్యారు. తెలంగాణలో టిఆర్ఎస్, టిడిపి పార్టీలు ఎన్డీఎ అభ్యర్థికి ఓట్లు వేయగా కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎం యుపిఎ అభ్యర్థికి ఓటు వేశారు. టిఆర్ఎస్ కు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఓటింగ్ లో తడబాటుకు గురైనట్లు తెలిసింది.

 

ఆయన ఎన్డీఎ అభ్యర్థి కోవింద్ కు ఓటు వేయాల్సి ఉండగా యుపిఎ అభ్యర్థి మీరాకుమార్ కు ఓటు వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై ఆయన ఆందోళన చెందిన విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే హరీష్ రావు ముత్తిరెడ్డిపై సీరియస్ అయ్యారు. తనకేం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, సిఎం కెసిఆర్ నోటిసుకు వెళ్లిందని, ఏమైనా ఉంటే సిఎం కే చెప్పుకోవాలని ముత్తిరెడ్డికి హరీష్ క్లాస్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

 

ఇలాంటి తతంగం ఏదో జరుగుతదన్న భయంతోనే ముందుగా మాక్ పోలింగ్ కూడా నిర్వహించింది టిఆర్ఎస్. కానీ ముత్తిరెడ్డి మాత్రం తడబాటుకు గురవడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

PREV
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?