
ఒడిశా నుంచి కోట్లాది రూపాయల నకిలీ మద్యాన్ని కేటుగాళ్లు డంప్ చేశారు. మునుగోడు ఎన్నికల సమయంలో జోరుగా నకిలీ మద్యం అమ్మకాలు చోటు చేసుకున్నాయి. నకిలీ మద్యం అమ్మకాలతో భారీగా పడిపోయింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయం. ఆదాయం తగ్గడంతో అనుమానమొచ్చిన ఎక్సైజ్ శాఖ విచారణ జరిపింది. అధికారుల దర్యాప్తులో బాల్‌రాజ్ గౌడ్ నకిలీ మద్యం దందా బయటపడింది. ఒడిశా నుంచి నకిలీ మద్యం తెప్పించినట్లు అధికారులు గుర్తించారు. ఒడిశాలోని డంప్ కోసం బాల్‌రాజ్‌ను అక్కడికి తీసుకెళ్లారు. ఈ కేసులో బాల్‌రాజ్ భాగస్వామి కొండల్ రెడ్డి పరారీలో వున్నాడు. దీంతో అతని కోసం పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జోరుగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ గుర్తించింది. బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం గుర్తించారు. మద్యం వ్యాపారి బింగి బాలరాజుగౌడ్‌కి చెందిన గోదాంలో నకిలీ మద్యాన్ని గుర్తించారు. బాలరాజు గౌడ్, కొండల్ రెడ్డి కలిసి నకిలీ మద్యం సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. 20 వైన్ షాపులకు నకిలీ మద్యం పంపిణీ చేస్తున్నట్లుగా నిర్ధారించారు ఎక్సైజ్ అధికారులు. గతంలో కూడా బింగి బాలరాజుగౌడ్‌ను పట్టుకున్నారు అధికారులు.
ALso REad: పెను విషాదం... 86మందిని బలితీసుకున్న నకిలీ మద్యం
మునుగోడు ఎన్నికల్లో కూడా ఇదే మద్యం సరఫరా అయినట్లుగా తెలుస్తోంది. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్‌లో నకిలీ మద్యం సీజ్ చేశారు అధికారులు. వీటి విలువ దాదాపు రూ.2 కోట్లుపైనే వుంటుందని అంచనా. ఈ కేసులో ఇబ్రహీంపట్నం, హయత్ నగర్‌లలోని బెల్టు షాపులకు తక్కువు ధరకే రెండు బ్రాండ్‌ల మద్యాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం శాంపిల్స్‌ను ఎక్సైజ్ ల్యాబ్‌కు పంపారు.