7.5 శాతం ఫిట్‌మెంటా... కేసీఆర్ వద్దే తేల్చుకుంటాం: ఉద్యోగ సంఘాలు

By Siva KodatiFirst Published Jan 27, 2021, 7:30 PM IST
Highlights

30 నెలలు ఆలస్యంగా వచ్చిన పే రివిజన్ కమిటీ (పీఆర్సీ) సిఫారసులపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ని జీర్ణించుకోలేకపోతున్నాయి

30 నెలలు ఆలస్యంగా వచ్చిన పే రివిజన్ కమిటీ (పీఆర్సీ) సిఫారసులపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ని జీర్ణించుకోలేకపోతున్నాయి. పే రివిజన్ కమిటీ కాస్తా.. పే రిడక్షన్ కమిటీగా మారిపోయిందన్నారు టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్.

7.5 శాతం ఫిట్‌మెంట్‌కు సిఫారసు చేయడం దారణమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో పీఆర్సీ కమిటీ 27 శాతం ఫిట్‌మెంట్‌కు సిఫారసు చేస్తే 43 శాతం వేతనాలను పెంచారని వారు గుర్తుచేస్తున్నారు.

ఇవాళ్టీ పీఆర్‌సీ కమిటీ రిపోర్ట్‌ను చూసి ఉద్యోగులెవ్వరూ డిజాప్పాయింట్ కావొద్దని.... అన్ని సంఘాల్ని చర్చలకు పిలుస్తారు కాబట్టి ప్రభుత్వం వద్ద దీనిపై డిమాండ్ చేయాలని వారు పిలుపునిచ్చారు.

Also Read:పీఆర్సీ రిపోర్టుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం: సచివాలయం ఎదుట ఆందోళన

పీఆర్సీ కమీషన్ అడ్వైజరీ కమిటీ మాత్రమేనని... గతంలో కమీషన్ రిపోర్టులను ఎప్పుడూ అమలు చేయలేదని వారు గుర్తుచేస్తున్నారు. 43 శాతం కన్నా తక్కువ ఇవ్వొద్దని కోరామని రాజేందర్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దగ్గరే తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

పీఆర్సీ నివేదికపై సీఎస్‌కు తమ ఆవేదన తెలిపామని.. ఇది పీఆర్సీ నివేదిక కాదు, పిసినారి నివేదిక అంటూ టీజీవో అధ్యక్షురాలు మమత అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షాలన ఉంటారన్న నమ్మకం వుందని మమత ఆకాంక్షించారు. 

click me!