కాలువలో రేణుకా చౌదరి పీఏ గల్లంతు: గజ ఈతగాడిగా గుర్తింపు, మరెలా..!!

Siva Kodati |  
Published : Jan 27, 2021, 05:05 PM IST
కాలువలో రేణుకా చౌదరి పీఏ గల్లంతు: గజ ఈతగాడిగా గుర్తింపు, మరెలా..!!

సారాంశం

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకాచౌదరి పీఏ రవి నాగార్జున సాగర్‌ కాలువలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకాచౌదరి పీఏ రవి నాగార్జున సాగర్‌ కాలువలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు.

అయితే గజ ఈతగాడిగా పేరు పొందిన రవి గల్లంతవ్వడం తోటి సిబ్బందిని విస్మయ పరుస్తోంది. అయితే రవికి గుండెపోటు రావడంతో కాలువలో గల్లంతై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

రేణుకా చౌదరికి తల్లో నాలుకలా, ప్రధాన అనుచరుడిగా రవి గుర్తింపు పొందాడు. అన్ని వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు ఆమెకు పీఏగా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలోని సాగర్ కాలువలో రవి ఈతకు వెళ్లాడు.

ఈ క్రమంలోనే ఆయన గల్లంతైనట్లుగా తెలుస్తోంది. 11 కిలోమీటర్లు ఏకబిగిన రవి ఈత కొడతాడని స్థానికులు, సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈతకు వెళ్లిన అనంతరం రవికి గుండెపోటు వచ్చి ఉంటుందని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన కాలువలో గల్లంతై ఉంటాడని భావిస్తున్నారు. కాలువ సమీపంలో రవికి చెందిన బుల్లెట్‌ వాహనం, చెప్పులు, బ్యాగ్‌ ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Health: ఉచితంగా కంటి ప‌రీక్షల శిబిరం.. నెల‌రోజుల పాటు అవ‌కాశం, ఎక్క‌డంటే.?
పెళ్లి చేసుకోరు కానీ ఒకే రూమ్‌లో క‌లిసి ఉంటారు.. ఫుడ్డు, బెడ్డు అంతా వాళ్ల‌దే. హైద‌రాబాద్‌లో కొత్త క‌ల్చ‌ర్