పీఆర్సీ రిపోర్టుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం: సచివాలయం ఎదుట ఆందోళన

By narsimha lodeFirst Published Jan 27, 2021, 4:23 PM IST
Highlights

 పీఆర్సీ రిపోర్టును నిరసిస్తూ ఉద్యోగులు బుధవారం నాడు తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 7.5 శాతం వద్దు 63 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని  ఉద్యోగులు డిమాండ్ చేశారు.

హైదరాబాద్: పీఆర్సీ రిపోర్టును నిరసిస్తూ ఉద్యోగులు బుధవారం నాడు తెలంగాణ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 7.5 శాతం వద్దు 63 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని  ఉద్యోగులు డిమాండ్ చేశారు.

బీఆర్‌కే భవన్ ముందు పీఆర్సీ కాపీలను చించివేశారు ఉద్యోగులు. 63 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీ నివేదికపై  ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.తమకు 63 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీ కమిటీని రద్దు చేసి  ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

also read:ఫిట్‌మెంట్‌పేరుతో డ్రామా: కేసీఆర్‌పై బండి సంజయ్

గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందించింది.అయితే  ఈ నివేదికను ప్రభుత్వం బయటపెట్టిందని ఇవాళ ఉదయం వార్తలొచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో రిపోర్టు చక్కర్లు కొట్టింది. మీడియా కూడ ఈ రిపోర్టును ప్రసారం చేసింది. అయితే ఈ రిపోర్టు ఎలా లీకైందనే విషయమై విచారణ చేపట్టాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. 

click me!