ఫిట్‌మెంట్‌పేరుతో డ్రామా: కేసీఆర్‌పై బండి సంజయ్

By narsimha lodeFirst Published Jan 27, 2021, 4:00 PM IST
Highlights

ఫిట్‌మెంట్ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
 

హైదరాబాద్: ఫిట్‌మెంట్ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెర తీశారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వ వైఖరిని బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు బుధవారం నాడు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు..

also read:పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు వ్యతిరేకమే: టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్

7.5 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి మూడేళ్ల సమయం కావాలా అని ఆయన ప్రశ్నించారు.7.5 శాతం ఫిట్‌మెంట్  ఇచ్చి హెచ్ఆర్ఏ 6 శాతం తగ్గించాలని ప్రతిపాదించడం దారుణమన్నారు. ప్రతి రోజూ ధరలు పెరుగుతుంటే హెచ్ఆర్ఏ తగ్గించడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఉద్యోగులు కోరినట్టుగా ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఆయన కోరారు.  పీఆర్సీని వేసినప్పుడు ఐఆర్ ఇవ్వడం సంప్రదాయమన్నారు. కానీ ఐఆర్ ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన పేరుతో నిరుద్యోగులను మోసం చేశారన్నారు. సన్న బియ్యం పేరుతో రైతులను సీఎం మోసం చేసినట్టుగా చెప్పారు.

సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పని చేయనిచ్చిందా  లేదా బలవంతంగా పీఆర్సీని రాయించారా అని ఆయన ప్రశ్నించారు.మూడేళ్లుగా ఉద్యోగులను ఊరించి ఏం ఇచ్చారన్నారు. 
 

click me!