క్యామా మల్లేష్ పై వేటు వేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

By pratap reddyFirst Published Nov 21, 2018, 8:17 AM IST
Highlights

ఇబ్రహీంపట్నం టికెట్ కోసం ఎఐసిసి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్ దాస్ కుమారుడు 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని క్యామా మల్లేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. టీడీపి చేసిన సీట్ల కేటాయింపుపై క్యామా మల్లేషన్ తెలంగాణ పిసిసి నాయకులపై ఆరోపణలు చేశారు. 

హైదరాబాద్: తమ పార్టీ నేతలపై తీవ్రమైన ఆరోపణలను చేసిన క్యామా మల్లేష్ పై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వేటు వేశారు. క్యామా మల్లేష్ ను రంగా రెడ్డి జిల్లా పారట్ీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. 

ఇబ్రహీంపట్నం టికెట్ కోసం ఎఐసిసి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్ దాస్ కుమారుడు 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని క్యామా మల్లేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. టీడీపి చేసిన సీట్ల కేటాయింపుపై క్యామా మల్లేషన్ తెలంగాణ పిసిసి నాయకులపై ఆరోపణలు చేశారు. 

క్యామా మల్లేష్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. రాత్రిలోగా సమాధానం ఇవ్వాలని ఆయన మంగళవారంనాడు క్యామా మల్లేష్ ను అడిగారు. సమాధానం రాకపోతే బుధవారం క్యామా మల్లేష్ ను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. 

తనపై వేటు వేయడంపై క్యామా మల్లేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను గత 35 ఏళ్లుగా కాంగ్రెసులో పనిచేస్తున్నాని, సోనియా గాంధీని గానీ రాహుల్ గాంధీని గానీ తాను పల్లెత్తు మాట అనలేదని ఆయన అన్నారు. అధిష్టానంపై విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, కాంగ్రెసు పార్టీ జెండాను ధ్వంసం చేసిన కార్తిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

click me!