కె.లక్షణ్ పార్టీలో గత 28యేళ్లుగా ఉండగా, కిషన్ రెడ్డి గత 24 యేళ్లుగా ఉన్నారు. లక్ష్మణ్ ఏడుసార్లు అసెంబ్లీ బరిలో ఉండగా, కిషన్ రెడ్డి 5 సార్లు బరిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వీరిద్దరికీ బీజేపీ టికెట్ ఇవ్వలేదు?
హైదరాబాద్ : నేడు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కి నోటిఫికేషన్ విడుదల కానుంది.వెంటనే నామినేషన్లు పడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు దాదాపుగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక బిజెపి కూడా నిన్న మూడో జాబితా విడుదల చేసింది. అయితే, ఈసారి బిజెపి జాబితాలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ లు ఈసారి బరిలో లేరు. తెలంగాణకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు బరిలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకే వీరిద్దరూ పోటీకి దూరంగా ఉన్నారు. కె. లక్ష్మణ్ గత 28 ఏళ్లలో బీజేపీ నుంచి ఏడుసార్లు పోటీ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా గత 24 ఏళ్లలో ఆరుసార్లు పోటీ చేసి మూడుసార్లు గెలిచారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా ఉండగా, లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2008 ఉప ఎన్నికల్లోను పోటీ చేసిన లక్ష్మణ్ అప్పటి ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి టి. మణెమ్మ చేతిలో ఓడిపోయారు.
undefined
బీజేపీ మూడు జాబితాలు: ఓసీలకంటే బీసీలకే ఎక్కువ సీట్లు
లక్ష్మణ్ వరుసగా 1994, 1999, 2009, 2014, 2018లలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేశారు.1999, 2014లలో విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా 1999లో కార్వాన్ నుంచి ఓడిపోయారు. కానీ, ఆయన మొత్తంగా ఐదు సార్లు పోటీ చేశారు. ఇందులో మూడుసార్లు గెలిచారు. 1999లో ఓడిపోయిన తర్వాత 2004లో హిమాయత్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు.
ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనతో హిమాయత్ నగర్ రద్దయింది. దీంతో 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట్ నుంచి పోటీ చేశారు. గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఈ సారి బీజేపీ తన అభ్యర్థుల్లో ఓసీలకంటే బీసీలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ ముఖ్య నేతలిద్దరినీ బరిలోకి దించకపోవడం వెనుక ఎలాంటి వ్యూహం ఉందో వేచి చూడాలి.